Fact Check : జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ను నిలిపివేస్తున్నామని అమిత్ షా ట్వీట్ చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 8:05 AM IST
Fact Check : జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ను నిలిపివేస్తున్నామని అమిత్ షా ట్వీట్ చేశారా..?

జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ను ఆపేస్తున్నామంటూ భారత యూనియన్ మినిస్టర్ అమిత్ షా ప్రకటించారని చెబుతున్న ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.



“Fixed Line, Broadband and Mobile Internet services to be snapped in UTs of J&K and Ladakh from tonight,” అంటూ అమిత్ షా ట్వీట్ చేశారని.. ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. ఫిక్స్డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ ఇంటర్నెట్ సేవలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ లలో నిలిపివేస్తున్నామంటూ ట్వీట్ చేశారని అందరూ షేర్ చేస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్ లో వివాదాస్పదమైన ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఇంటర్నెట్ ను నిలిపివేస్తూ ఉంటారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు కూడా కొన్ని నెలల పాటూ జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ను నిలిపివేశారు. బ్రాడ్ బ్యాండ్, లో స్పీడ్ 2జి సేవలను మాత్రమే అక్కడ అందించారు.

నిజ నిర్ధారణ:

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రతినిధి వైరల్ అవుతున్న ఈ ట్వీట్ ను ఫేక్ అని తేల్చేశారు.

“A tweet is circulating in the name of Union Home Minister mentioning fixed-line broadband and internet in Jammu and Kashmir and Ladakh to be snapped. This tweet is fake. No such tweet has been done from Union Home Minister’s twitter handle,” అంటూ ట్వీట్ చేశారు.



ఫిక్స్డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, మొబైల్ ఇంటర్నెట్ సేవలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ లలో నిలిపివేస్తున్నామంటూ యూనియన్ హోమ్ మినిస్టర్ పేరిట వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని తేల్చి చెప్పారు. యూనియన్ హోమ్ మినిస్టర్ ట్విట్టర్ ఖాతా నుండి అలాంటి ట్వీట్ ఏదీ వెలువడలేదని తేల్చి చెప్పింది.

Press Information Bureau (PIB) కూడా అమిత్ షా ట్విట్టర్ ఖాతా నుండి ఇటువంటి ట్వీట్ వెలువడలేదని తేల్చి చెప్పింది. ఇది ఫోటో షాప్ చేసిన ఫేక్ ట్వీట్ అని తెలుస్తోంది.

అమిత్ షా ట్విట్టర్ ఖాతాను చూడగా.. అలాంటి ట్వీట్ ఏదీ వెలువడలేదు.

జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ను ఆపివేస్తున్నామంటూ అమిత్ షా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ట్వీట్ పచ్చి అబద్ధం.

Next Story