బిగ్‌బ్రేకింగ్ : కేరళలో ఘోర విమాన ప్రమాదం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2020 9:42 PM ISTఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం((IX-1344) కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:45 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిని.. రెండు ముక్కలైంది. ఈ ఘటనలో పైలట్‌తో సహా ఇద్దరు మృతిచెందగా.. మరో యాభై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనా. భారీ వర్షం ఉండటం చేత సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటనపై డీజీసిఏ విచారణకు ఆదేశించింది.
#WATCH Kerala: Dubai-Kozhikode Air India flight (IX-1344) with 190 people onboard skidded during landing at Karipur Airport today. (Video source: Karipur Airport official) pic.twitter.com/aX90CYve90
— ANI (@ANI) August 7, 2020