ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన శరణ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడు రోహిత్‌ను ప్రేమించి ఏడాది కిందట పెళ్లి చేసుకుంది. కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత మద్యానికి బానిపైన రోహిత్‌.. శరణ్యను నిత్యం వేదించడం మొదలు పెట్టాడు. భర్త వేదింపులు భరించలేదని శరణ్య.. పుట్టింటికి వచ్చేసింది. భర్తతో విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు కూడా ఎక్కింది.

పెద్దల సమక్షంలో పంచాయతీలో భార్యను మంచిగా చూసుకుంటానని మూడు నెలల క్రితం ఆమెను బెంగళూరు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో శరణ్య చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. శరణ్య మరణవార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు వెంటనే బెంగళూరు పయనమయ్యారు. తమ కుమార్తె మరణానికి అల్లుడు రోహితే కారణమని ఆరోపిస్తున్నారు. అతడు హత్య చేయడమో, లేక ఆత్మహత్య చేసుకునేంత స్థాయిలో వేధించడమో కారణం అయ్యుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లుడు రోహిత్‌ను కఠినంగా శిక్షించాలని శరణ్య తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.