ఎంఐఎం పార్టీ నేత, మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. బీజేపీ ఎస్.సి.మోర్చా నేషనల్ సెక్రెటరీ మిస్ బంగారి శృతి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను దూషించారని చెబుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బలాల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

తనతో దురుసుగా ప్రవర్తించారంటూ భాజపా నాయకురాలు బంగారు శృతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఎస్సీ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేయగా, బాధితురాలిని పరామర్శించేందుకు రెండు వారాల కిందట శృతి చాదర్ ఘాట్ కు వెళ్లారు. బిజెపి ఎం.ఎల్.సి. రామచందర్ రావు, డాక్టర్ భగవంత్ రావు, మాజీ మంత్రి విజయ రామారావుతో పాటూ మరికొందరు బీజేపీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు.

పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. రేప్ విక్టిమ్ ను ఎవరెవరు కలవడానికి వచ్చారో ఎంఎల్ఏ బలాల వాకబు చేశారు. దీనిపై బలాల స్పందిస్తూ ‘థర్డ్ గ్రేడ్ మనుషులు’ ‘చోర్ లోగ్'(దొంగలు) అంటూ వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. తనను ఎమ్మెల్యే బలాలా కించపరిచారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ లో తన క్యాస్ట్ గురించి బలాల అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ కంప్లయింట్ రాశారు. పోలీసులు కేసును (crime no. 142/2020) అండర్ సెక్షన్ 509 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 3(1)r ఆఫ్ SC & ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *