కృష్ణపట్నం పోర్టులో భారీ వాటాను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sept 2020 11:31 AM IST
కృష్ణపట్నం పోర్టులో భారీ వాటాను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును దక్కించుకుంది. ఒకటిన్నర నెల తర్వాత కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు లభించింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా ఇందుకు సీల్ అప్రూవల్ ఇచ్చింది. మొత్తం 13,572 కోట్ల రూపాయల డీల్ ను కుదుర్చుకుంది.

కృష్ణ పట్నం పోర్టులో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) సంస్థకు 75శాతం వాటాను కేటాయించింది ప్రభుత్వం. కృష్ణ పట్నం పోర్టు బాధ్యతలు అదానీ గ్రూప్ కు ఇకపై సంబంధం అని ప్రభుత్వం తరపున ఎన్.ఓ.సి. ఇచ్చామని ఏపీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాకు తెలిపారు.

కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఈ డీల్ కు జులై నెల మూడో వారంలోనే అప్రూవల్ ను ఇచ్చింది. తాజాగా అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో 75శాతం వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. దేశంలోని రెండో అతిపెద్ద మల్టీ-కార్గో ప్రైవేట్ సెక్టార్ పోర్టుగా ఉంది కృష్ణపట్నం పోర్టు. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ పోర్టు అయిన గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో ఉన్న ముంద్ర ను కూడా అదానీ గ్రూప్ ఆపరేట్ చేస్తోంది.

అదానీ గ్రూప్‌కు ఇప్పటికే 6 నాన్-మెట్రో విమానాశ్రయాల కాంట్రాక్టులు దక్కించుకుంది. లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరు పోర్టుల కాంట్రాక్టును దక్కించుకుంది. ఇక సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆస్తులు అత్యధికంగా ఉన్న కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

Next Story