ఏపీలోని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన .. అవస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దశరథరామిరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్‌, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి (వైసీపీ ఎంపీ), మరో కుమారుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి ఎమ్మెల్యే). ఇద్దరు కుమారులు రాజకీయాల్లోనూ, అధికార పార్టీ వైసీపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సుభాష్

.

Next Story