బ్లాక్ రోజ్ సినిమా కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఊర్వశి.. డైరెక్టర్ ఎవరంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 3:37 AM GMT
బ్లాక్ రోజ్ సినిమా కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఊర్వశి.. డైరెక్టర్ ఎవరంటే..?

ఊర్వశి రౌతేలా.. బాలీవుడ్ బ్యూటీకి హీరోయిన్ గా పెద్ద సక్సెస్ ను ఇప్పటి వరకూ చవిచూడలేదు. కానీ అమ్మడికి సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా అమ్మడిని నటింపజేయాలనే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ కోసం ఊర్వశిని సంప్రదించారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా లోనూ ఊర్వశి కనిపించలేదు.

తాజాగా తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కబోయే బ్లాక్ రోజ్ సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చింది ఊర్వశి. ఈ సినిమాకు సంపత్ నంది స్టోరీ-స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు. ఏమైంది ఈవేళ సినిమా ద్వారా టాలీవుడ్ లో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సంపత్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాల ద్వారా సక్సెస్ ను అందుకున్నాడు. గౌతమ్ నందా సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. సీటీమార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను పెట్టి బ్లాక్ రోజ్ ను తెరకెక్కించేందుకు సన్నాహకాలు మొదలుపెట్టాడు. విలియం షేక్ స్పియర్ నాటకం అయిన మర్చంట్ ఆఫ్ వెనీస్ ఆధారంగా కథను సంపత్ నంది రూపొందించాడట. మోహన్ భరద్వాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. బ్లాక్ రోజ్ సినిమా కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టానని ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. డైరెక్టర్ సంపత్ నంది సినిమా కథను తెరకెక్కించే సమయంలో తనను మనసులో పెట్టుకుని రాశారని అమ్మడు చెబుతోంది. ఈ సినిమా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. టాలీవుడ్ లో డెబ్యూ ఇవ్వడానికి ఊర్వశి రౌతేలా కూడా ఎంతగానో ఎదురుచూస్తోందని చెప్పారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని.. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తీ చేయాలని అనుకుంటూ ఉన్నామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ లో ఒక్క సక్సెస్ ను అందుకోని ఊర్వశి రౌతేలాకు టాలీవుడ్ లో అయినా అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.

Next Story