సుశాంత్ మరణం వెనుక ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Aug 2020 3:22 AM GMT
సుశాంత్ మరణం వెనుక ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారా..?

బీజేపీ రాజ్య సభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలో దుబాయ్ లింక్ లు ఉండొచ్చు అంటూ అనుమానాలను వ్యక్తం చేయడం సంచలనం అయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక దుబాయ్ లో కూర్చున్న మనీలాండరర్లు.. ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఉండొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ లో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ క్రైమ్స్ ఉండవని సుశాంత్ కేసులో సిల్లీ స్టెప్స్ తీసుకుంటున్నారని టైమ్స్ నౌ నిర్వహించిన డిబేట్ లో చెప్పుకొచ్చారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సుప్రీంకోర్టు సీబీఐ ఎంక్వయిరీకి బదలాయించాక సుబ్రహ్మణ్య స్వామి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం న్యాయ‌బ‌ద్ద‌మైన‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొదటి నుండి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఆయన అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

సుశాంత్ ను హత్య చేసి చంపారని మెడ మీద ఉన్న మార్క్ ను చూస్తేనే చెప్పేయొచ్చని.. ప్రజలను మోసం చేయాలని అనుకోవద్దని మీనాక్షి మిశ్రా అనే వైద్యురాలు చెప్పిన వీడియోను బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి మొదట రీట్వీట్ చేశారు.

తాను సుశాంత్ మరణాన్ని ముమ్మాటికీ హత్యగానే భావిస్తూ ఉన్నానని కొన్ని కీలక పాయింట్లను సుబ్రహ్మణ్య స్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సుశాంత్ కనిపించకుండా పోవడం, మెడ మీద ఉన్న గుర్తులు, కళ్లు తేలేయక పోవడం, ఫ్యాన్ కు వేలాడుతున్న వస్త్రం, శరీరం మీద ఉన్న వేరు వేరు గుర్తులు, సిసిటివి ఫుటేజీ, సుశాంత్ సన్నిహితుల ప్రవర్తనా తీరు, దిశా సలియన్ ఆత్మహత్య, సూసైడ్ నోట్ కనిపించకుండా పోవడం, సుశాంత్ పదే పదే సిమ్ కార్డులను మార్చడం వంటివన్నీ మర్డర్ అనే అనుమానాలకు తావు ఇస్తున్నాయని ఆయన ఓ లిస్టు తయారుచేశారు. సుశాంత్ మరణంపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని సుబ్రమణియన్ స్వామి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీహార్ పోలీసులు సుశాంత్ మరణంపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారికి అవకాశం ఇవ్వాలని గతంలో ట్వీట్ చేశారు.

ఇక కంగనా రనౌత్ కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై అమితాబచ్చన్, కరణ్ జోహార్ లు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఎంతోమంది డిమాండ్ చేస్తుంటే వీళ్లు మాత్రం ఎందుకు ఆ డిమాండ్ చేయలేదని ప్రశ్నించింది. సుశాంత్ విషయంలో స్పందిస్తే తన రెప్యుటేషన్ దెబ్బ తినడంతో పాటు తన గురించి ఇండస్ట్రీలో కొందరు తప్పుగా అనుకుంటారనే భయంతోనే అమితాబచ్చన్ అంతటి స్టార్ కూడా స్పందించేందుకు ముందుకు రాలేదని.. అలాంటిది సామాన్య నటీనటులు ఎలా ముందుకు వస్తారని కంగనా అభిప్రాయం వ్యక్తం చేసింది.

Next Story
Share it