తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 985 కేసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 Jun 2020 5:11 PM GMTతెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4374 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 985 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12349 కేసులు నమోదు కాగా, 237 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలో 774 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చల్ జిల్లాలో 53 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 20కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 4766 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 7436 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 78 మంది డిశ్చార్జ్ అయ్యారు.