ఏపీలో కొత్తగా 91 కరోనా మరణాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2020 11:44 AM GMTఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్ ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఏపీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,34,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 87,803 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక 235218 కేసులు రికవరీ అయ్యాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 8,827 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
24 గంటల్లో ఎక్కడ ఎంత మంది మృతి చెందారు..
ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 మంది కరోనాతో మృతి చెందారు. ఇక జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరులో 16, ప్రకాశంలో 4, నెల్లూరులో 12, అనంతపురంలో 8, తూర్పుగోదావరిలో 11, పశ్చిమగోదావరి 13, కడపలో 7, గుంటూరులో 3, కర్నూలులో 3, విశాఖలో 6, శ్రీకాకుళంలో 5, కృష్ణా జిల్లాలో 3 చొప్పున మొత్తం 91 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3092కి చేరింది.
#COVIDUpdates: 21/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,32,045 పాజిటివ్ కేసు లకు గాను
*2,41,150 మంది డిశ్చార్జ్ కాగా
*3,092 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 87,803#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/clf5yJAFdG
— ArogyaAndhra (@ArogyaAndhra) August 21, 2020