తెలంగాణ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. కొత్త‌గా 920 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 5:09 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. కొత్త‌గా 920 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3616 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 920 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 11364 కేసులు నమోదు కాగా, 230 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 737 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 4688 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 6446 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 327 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌

A1

Next Story