తెలంగాణ‌లో 10వేలు దాటిన క‌రోనా కేసులు.. కొత్త‌గా 891

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2020 3:18 PM GMT
తెలంగాణ‌లో 10వేలు దాటిన క‌రోనా కేసులు.. కొత్త‌గా 891

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4069 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 891 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 10444 కేసులు నమోదు కాగా, 225 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 719 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 4361 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 5858 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 137 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌

Ss

Next Story
Share it