ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 8,732 కేసులు.. 87 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 12:37 PM GMT
ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా బీభ‌త్సం.. కొత్త‌గా 8,732 కేసులు.. 87 మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువ‌య్యాయి. గడిచిన 24గంటల్లో 53,712 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,732 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో పది మంది, గుంటూరులో తొమ్మిదిమంది, తూర్పు‌గోదావరిలో ఎనిమిదిమంది, ప‌శ్చిమ గోదావ‌రిలో ఎనిమిదిమంది, అనంత‌పురంలో ఏడుగురు, క‌డ‌ప‌లో ఏడుగురుగురు, క‌ర్నూలులో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఆరుగురు, విజ‌య‌న‌గ‌రంలో ఆరుగురు, ప్ర‌కాశంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు చొప్పున మొత్తం 87మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 2,562 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,91,117 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 88,138 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 851,

చిత్తూరులో 959,

ఈస్ట్‌ గోదావరిలో 1126,

గుంటూరులో 609,

కడపలో 389,

కృష్ణలో 298,

కర్నూలులో 734,

నెల్లూరులో 572,

ప్రకాశంలో 489,

శ్రీకాకుంలో 638,

విశాఖపట్నంలో 894,

విజయనగరంలో 561,

పశ్చిమ గోదావరిలో 612 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Next Story