ఏపీలో కొత్త‌గా 7,956 కేసులు.. 60 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2020 12:34 PM GMT
ఏపీలో కొత్త‌గా 7,956 కేసులు.. 60 మ‌ర‌ణాలు

ఏపీలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 61,529 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,956 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,75,079కి చేరింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరులో తొమ్మిది మంది, అనంత‌పూర్‌లో ఏడుగురు, క‌ర్నూలులో ఐదుగురు, ప్ర‌కాశంలో ఐదుగురు, విశాఖ‌ప‌ట్నంలో ఐదుగురు, తూర్పు గోదావ‌రిలో న‌లుగురు, క‌డ‌ప‌లో న‌లుగురు, కృష్ణ‌లో న‌లుగురు, శ్రీకాకుళంలో న‌లుగురు, విజ‌య‌న‌గ‌రంలో న‌లుగురు, ప‌శ్చిమ గోదావ‌రిలో న‌లుగురు, నెల్లూరులో ముగ్గ‌రు మ‌రియు గుంటూరులో ఇద్ద‌రు చొప్పున మొత్తం 60 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,972కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4,76,903 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 93,204 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 483,

చిత్తూరులో 748,

ఈస్ట్‌ గోదావరిలో 1412,

గుంటూరులో 666,

కడపలో 326,

కృష్ణలో 201,

కర్నూలులో 341,

నెల్లూరులో 756,

ప్రకాశంలో 444,

శ్రీకాకుంలో 517,

విశాఖపట్నంలో 490,

విజయనగరంలో 481,

పశ్చిమ గోదావరి 1091 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.Next Story
Share it