ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
By తోట వంశీ కుమార్ Published on 22 Sept 2020 6:14 PM ISTఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 68,829 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,553 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,39,302కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది మంది, అనంతపూర్‌లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,461కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5,62,376 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 71,465 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 309,
చిత్తూరులో 902,
ఈస్ట్ గోదావరిలో 1166,
గుంటూరులో 606,
కడపలో 589,
కృష్ణలో 344,
కర్నూలులో 272,
నెల్లూరులో 556,
ప్రకాశంలో 672,
శ్రీకాకుంలో 347,
విశాఖపట్నంలో 410,
విజయనగరంలో 391,
పశ్చిమ గోదావరి 989 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.