తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. కొత్త‌గా 546 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 4:16 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. కొత్త‌గా 546 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 546 కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7072 కేసులు నమోదు కాగా, 203 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 458 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3506 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 3363 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 154 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Gh

Next Story