పెరుగుతున్న కేసులు.. వినాశనమేనా.!

By అంజి  Published on  24 March 2020 1:17 PM GMT
పెరుగుతున్న కేసులు.. వినాశనమేనా.!

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 519కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌ బారిన పడి 40 మంది కోలుకున్నారని తెలిపింది. అయితే మహమ్మారి కరోనా బారిన పడి తొమ్మిది మంది మాత్రమే మృతి చెందారని తెలిపింది. ప్రస్తుతం 24 రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విస్తరించింది.

Also Read: పెద్ద పెద్ద మహమ్మరులనే భారత్‌ జయించింది

రాష్ట్రాల వారిగా కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీ-30,ఆంధ్రప్రదేశ్‌-8, బిహార్‌-3, ఛత్తీస్‌గఢ్‌-1, గుజరాత్‌-33, హర్యానా-33, హిమాచల్‌ప్రదేశ్‌-3, కర్నాటక-37, కేరళ-95

, మధ్యప్రదేశ్‌-7, మహారాష్ట్ర-89, మణిపూర్‌-1, ఒడిశా-2, పుదుచ్చేరి-1, పంజాబ్‌- 29, రాజస్థాన్‌-32, తమిళనాడు-15, తెలంగాణ-35, చండీగఢ్‌-7, జమ్ముకశ్మీర్‌-4, లఢక్‌-13, ఉత్తరప్రదేశ్‌-33, ఉత్తరాఖండ్‌-4, పశ్చిమ బెంగాల్‌-9 కరోనా పాజటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 16,869 మంది మృతి చెందారు. అలాగే 3,78,927 మంది కరోనా బారిన పడ్డారు.

Also Read: చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌

Next Story