పెద్ద పెద్ద మహమ్మరులనే భారత్‌ జయించింది

By అంజి  Published on  24 March 2020 11:57 AM GMT
పెద్ద పెద్ద మహమ్మరులనే భారత్‌ జయించింది

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కూడా కట్టడి చేసే శక్తి ఉందని భారత్‌కు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పోలియో, స్మాల్‌ పాక్స్‌ వంటి అతి పెద్ద మహమ్మారులను కూడా భారత్‌ జయించిందన్నారు. అప్పుడే ప్రపంచానికి భారత్‌ ఓ మార్గం చూపిందని మైకేల్‌ ర్యాన్ గుర్తు చేశారు. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న ప్రాంతాల్లో వైద్య కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ వంటి అధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని సునిశీతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మైకెల్‌ ర్యాన్‌ వ్యాఖ్యనించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకి ఇప్పటికే 16 వేల మందికిపైగా మృతి చెందారు. లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అన్ని దేశాలు కరోనా విషయంలో మరింత కఠినమైన, వేగవంతమైన చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది.

Also Read: కరోనా ఎఫెక్ట్‌ .. నిలిచిపోయిన కరెన్సీ నోట్ల ముద్రణ

భారత్‌ దేశంలో కూడా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 492 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 36 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 106కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలు అవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

Next Story