ముఖ్యాంశాలు

  • మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం
  • సీనియర్ సిటిజన్స్‌కు 50శాతం డిస్కౌంట్‌పై హర్షాతీరేకాలు

ఢిల్లీ: మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ రూపంలో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్‌కు అండగా నిలుస్తున్న మోదీ సర్కార్… తాజాగా సీనియర్ సిటిజన్స్ కోసం మునుపెన్నడూ లేని డెసిషన్ తీసుకుంది. భారతీయ పౌరసత్వం కలిగి ఉండి 60 ఏళ్లు నిండిన వృద్ధులకు విమాన ప్రయాణంలో రాయితీ కల్పించింది. ఒకటి కాదు రెండు కాదు కేవలం టికెట్ పై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. పౌరవిమానయాన సంస్థ ఈ ప్రతిపాదనను ఇప్పటికే ప్రధాని కార్యాలయానికి పంపించింది. ప్రధాని సంతకం పెట్టి ఆమోదం తెలిపితే ఈ ఆఫర్ అమల్లోకి వస్తుంది. అన్నట్టు ఈ ఆఫర్‌కు ప్రభుత్వం చాలా నిబంధనలను ముడి పెట్టింది. ఇది కేవలం పౌర విమానయాన సంస్థ నడిపిస్తున్న ఎయిర్ ఇండియా, దాని అనుబంధ విమాన సంస్థల్లో మాత్రమే ప్రయాణంలో వృద్ధులకు 50 శాతం రాయితీ కల్పించింది.

ఈ ప్రయాణం కేవలం ఇండియాలో మాత్రమే.. విదేశాల్లో కాదు. ఏడు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ వ్యాలిడిటీ కేవలం ఏడాది పాటు మాత్రమే ఉంటుంది. టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఏదైన గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఎయిర్ ఇండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డు ఉండాలి. బోర్డింగ్ సమయంలో సంబంధిత డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు చూపించకపోతే….ప్రయాణానికి అనుమతించరు. అంతేకాదు.. టికెట్ రీఫండ్ కూడా జరగదు. కేవలం సుంకం తాలుకా డబ్బులు మాత్రమే తిరిగి ఇస్తారు. టికెట్‌కు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వరు. సీనియర్ సిటిజన్స్ కు విమానప్రయాణంలో 50 శాతం రాయితీ నిర్ణయంపై హర్షాతీరేకాలు వ్యక్తమౌతున్నాయి. కాస్త ఆర్తిక స్థోమత ఉన్న వృద్ధులు కచ్చితంగా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే కేవలం ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లోనే పెట్టడంపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమౌతోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.