ఏపీలో కొత్త‌గా మ‌రో 47 క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 1:45 PM IST
ఏపీలో కొత్త‌గా మ‌రో 47 క‌రోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా.. మరో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే 47 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.



దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2561 అని ఆరోగ్య శాఖ‌ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 1778 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. గ‌డిచిన‌ 24 గంటల్లో కృష్ణా జిల్లాలో కొవిడ్‌-19 వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 56కి చేరింది.

ఇదిలావుంటే.. ఏపీలో కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మొదట్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదు కాగా, ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల నేపథ్యంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వస్తోంది.

Next Story