విజృంబిస్తున్న మహమ్మారి.. 23లక్షలకు చేరిన కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. దీని కారణంగా ఇప్పటికే లక్షమందికి పైగా చనిపోగా.. ఎంతో ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 23 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ రోజు రోజుకు ఎలా విజృంబిస్తుందో తెలుస్తుంది.
తాజా లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23,31,955 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీని బారినపడి ఆదివారం నాటికి 1,60,767 మంది మృతిచెందారు. అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 7,38,913 ఉండగా.. ఇప్పటి వరకు 39,014 మంది మృతిచెందారు. ఇందులో న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాలలో ఎక్కువగా చనిపోయారు. ఇక మరో దేశం స్పెయిన్‌లో ఇప్పటివరకూ మొత్తం 1,94,416 కేసులు నమోదవగా.. 20,639 మంది చనిపోయారు. ఇక ఇటలీలో 1,78,972మంది ఈ వైరస్ బారిన పడగా.. 23660 మంది మృతి చెందారు.