చంద్రబాబును టీడీపీ నుండి బహిష్కరించి 25 సంవత్సరాలు.. శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 9:43 AM GMT
చంద్రబాబును టీడీపీ నుండి బహిష్కరించి 25 సంవత్సరాలు.. శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు..!

తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన సంగతి తెలిసిందే..! ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఇప్పటికీ మిస్టరీనే..!

తెలుగుదేశం పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడుని తొలగించాలని మొదట రామారావు భావించారు. తెలుగుదేశం పార్టీలో సంక్షోభం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు. పార్టీకు వెన్నుపోటు పొడిచిన ఘటన అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.

చంద్రబాబు నాయుడు సహా మొత్తం ఐదుమందిని పార్టీ నుంచి ఎన్టీ రామారావు సస్పెండ్ చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు కోటగిరి విద్యాధరరావు, మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్, అశోక్ గజపతి రాజుల పేర్లున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు అప్పటి స్పీకర్ కు స్వయంగా ఎన్టీ రామారావు లేఖ కూడా రాశారు. 1995 ఆగస్టు 25వ తేదీన ఈ లేఖ రాశారు ఎన్టీ రామారావు.

టీడీపీ వ్యవస్థాపకుడు NTR గారు చంద్రబాబునాయుడును టీడీపీ నుండి బహిష్కరించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా

చంద్రబాబు గారికి వెట్టుపోటు శుభాకాంక్షలు. అదే వెన్నుపోటు బీజేపీని పొడవాలని ప్రయత్నించిన చంద్రబాబుకు అడ్రస్ గల్లంతయింది.ఎన్టీఆర్ కలలుకన్న స్వర్ణాంధ్రప్రదేశ్ ను బీజేపీ తప్పక సాధిస్తుంది అంటూ @bjymapofficial అఫీషియల్ అకౌంట్ నుండి ట్వీట్ వెలువడింది.



పార్టీ వ్యవస్థాపకుడు అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు అని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీ రామారావును దించి చంద్రబాబు నాయుడు అధిరోహించారని చాలా మంది నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Next Story