తెలంగాణ‌లో కొత్త‌గా 1,931 కేసులు.. 11 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 3:57 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1,931 కేసులు.. 11 మ‌ర‌ణాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగ‌స్టు 12న బుధ‌‌వారం) 23,303 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,931 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 11 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 86,475కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 665 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,780మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 63,074కి చేరింది. 22,736 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 28

భద్రాద్రి కొత్తగూడెం- 39

జీహెచ్‌ఎంసీ -298

జగిత్యాల-52

జనగాం- 59

జయశంకర్‌ భూపాలపల్లి – 17

జోగులాంబ గద్వాల – 56

కామారెడ్డి -39

కరీంనగర్ -89

ఖమ్మం -73

ఆసిఫాబాద్ – 3

మహబూబ్‌ నగర్ -43

మహబూబాబాద్ -34

మంచిర్యాల- 45

మెదక్ – 18

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 71

ములుగు –29

నాగర్‌కర్నూల్ – 53

నల్లగొండ – 84

నారాయణపేట -16

నిర్మల్ -24

నిజామాబాద్ – 53

పెద్దపల్లి – 64

రాజన్న సిరిసిల్ల -54

రంగారెడ్డి -124

సంగారెడ్డి -86

సిద్దిపేట – 71

సూర్యాపేట-64

వికారాబాద్‌-19

వనపర్తి –38

వరంగల్‌ రూరల్ –26

వరంగల్‌ అర్భన్ -144

యాదాద్రి భువనగిరి -18 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story