తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. కొత్త‌గా 1924 కేసులు

By Medi Samrat  Published on  8 July 2020 4:27 PM GMT
తెలంగాణ‌లో క‌రోనా ఉగ్ర‌రూపం.. కొత్త‌గా 1924 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 6363 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1924 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ప‌ద‌కొండు మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 29536 కేసులు నమోదు కాగా, 324 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 1590 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 99 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 43 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 14 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 20 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌‌ జిల్లాలో 15 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 13 కేసులు, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో 26 కేసులు, నిజామాబాద్‌ జిల్లాలో 19 కేసులు, వికారాబాద్ జిల్లాలో 11 కేసులు, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గ‌త ప‌దిహేను రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17279 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 11933 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 992 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌

Tt

Next Story