తెలంగాణ‌లో కొత్త‌గా 1,921 కేసులు.. 9 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 3:14 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1,921 కేసులు.. 9 మ‌ర‌ణాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగ‌స్టు 13న గురు‌‌వారం) 22,046 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,921 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 88,396కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 674 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,210మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 64,284కి చేరింది. 23,438 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 28

భద్రాద్రి కొత్తగూడెం- 34

జీహెచ్‌ఎంసీ -356

జగిత్యాల-40

జనగాం-38

జయశంకర్‌ భూపాలపల్లి – 21

జోగులాంబ గద్వాల – 51

కామారెడ్డి -44

కరీంనగర్ -73

ఖమ్మం -71

ఆసిఫాబాద్ – 17

మహబూబ్‌ నగర్ -48

మహబూబాబాద్ -28

మంచిర్యాల- 18

మెదక్ – 39

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 168

ములుగు –12

నాగర్‌కర్నూల్ – 26

నల్లగొండ – 73

నారాయణపేట -6

నిర్మల్ -37

నిజామాబాద్ – 63

పెద్దపల్లి – 54

రాజన్న సిరిసిల్ల -33

రంగారెడ్డి -134

సంగారెడ్డి -90

సిద్దిపేట – 63

సూర్యాపేట-47

వికారాబాద్‌-14

వనపర్తి –41

వరంగల్‌ రూరల్ –54

వరంగల్‌ అర్భన్ -74

యాదాద్రి భువనగిరి -16 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story