తెలంగాణలో కొత్తగా 1,921 కేసులు.. 9 మరణాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2020 8:44 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగస్టు 13న గురువారం) 22,046 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 9 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 88,396కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 674 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,210మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 64,284కి చేరింది. 23,438 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 28
భద్రాద్రి కొత్తగూడెం- 34
జీహెచ్‌ఎంసీ -356
జగిత్యాల-40
జనగాం-38
జయశంకర్ భూపాలపల్లి – 21
జోగులాంబ గద్వాల – 51
కామారెడ్డి -44
కరీంనగర్ -73
ఖమ్మం -71
ఆసిఫాబాద్ – 17
మహబూబ్ నగర్ -48
మహబూబాబాద్ -28
మంచిర్యాల- 18
మెదక్ – 39
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 168
ములుగు –12
నాగర్‌కర్నూల్ – 26
నల్లగొండ – 73
నారాయణపేట -6
నిర్మల్ -37
నిజామాబాద్ – 63
పెద్దపల్లి – 54
రాజన్న సిరిసిల్ల -33
రంగారెడ్డి -134
సంగారెడ్డి -90
సిద్దిపేట – 63
సూర్యాపేట-47
వికారాబాద్-14
వనపర్తి –41
వరంగల్ రూరల్ –54
వరంగల్ అర్భన్ -74
యాదాద్రి భువనగిరి -16 కేసులు నమోదు అయ్యాయి.