ఏపీలో కొత్తగా మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 11 July 2020 5:06 PM ISTఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం వందల సంఖ్యల కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,590 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1813 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1775 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 27,235కి చేరింది.
కొవిడ్ వల్ల కర్నూలులో నలుగురు, గుంటూరు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణ, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో, కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 309కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 14,393 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 12,533మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా
అనంతపురంలో 311,
చిత్తూరులో 300,
ఈస్ట్ గోదావరిలో 143,
గుంటూరులో 68,
కడపలో 47,
కృష్ణలో 123,
కర్నూలులో 229,
నెల్లూరులో 76,
ప్రకాశంలో 63,
శ్రీకాకుంలో 204,
విశాఖపట్నంలో 51,
విజయనగరంలో 76,
పశ్చిమ గోదావరిలో 84 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.