తెలంగాణ‌లో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా 178 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 4:16 PM GMT
తెలంగాణ‌లో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా 178 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. తాజాగా కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మంగ‌ళ‌వారం రాత్రి 8గంట‌ల‌కు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్క రోజు ఆరుగురు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసులు 3920కి చేరుకోగా, వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులున్నారు.

ఇక కరోనాతో 1742 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 2030 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా బారినప‌డి 148 మంది మృతి చెందారు.

కొత్తగా ఎక్కడ ఎన్ని కేసులు..

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ -143

రంగారెడ్డి – 15

మేడ్చల్‌ – 10

మహబూబ్‌నగర్ – 2

సంగారెడ్డి - 2

మెద‌క్ - 2

జ‌గిత్యాల - 1

అసిఫాబాద్ - 1

సిరిసిల్ల - 1

వ‌రంగ‌ల్ రూర‌ల్ - 1

Next Story