తెలంగాణ‌లో త‌గ్గ‌ని క‌రోనా కేసులు.. కొత్త‌గా 1640 కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 4:19 PM GMT
తెలంగాణ‌లో త‌గ్గ‌ని క‌రోనా కేసులు.. కొత్త‌గా 1640 కేసులు

తెలంగాణలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,466కి చేరంది. ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1,007 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 40,334గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 8 మంది మృతిచెందడంతో.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 455కి చేరింది.

అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 683 కుసులు, రంగారెడ్డి జిల్లాలో 135 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 102 కేస‌లు, కరీంనగర్ జిల్లాలో 100 కేస‌లు, నాగ‌ర్‌ కర్నూల్ జిల్లాలో 52 కేసులు, మహాబూబాబాద్ జిల్లాలో 44 కేసులు, నల్గొండ జిల్లాలో 42 కేస‌లు, పెద్దపల్లి జిల్లాలో 98 కేసులు న‌మోద‌య్యాయి.



Next Story