తెలంగాణలో కొత్తగా 1198 కరోనా కేసులు
By Medi Samrat Published on 20 July 2020 8:28 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,003 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,198 కేసులు పాజిట్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 46,274 కేసులు నమోదు కాగా, 422 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 510 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 106 కేసులు, మేడ్చల్ జిల్లాలో 76 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 10 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 73 కేసులు, కరీంనగర్ జిల్లాలో 87 కేసులు, జగిత్యాల జిల్లాలో 36 కేసులు, మహబూబబాద్ జిల్లాలో 36 కేసులు, మెదక్ జిల్లాలో 13 కేసులు, మహబూబ్ నగర్ జిల్లాలో 50 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 కేసులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 26 కేసులు, నల్గొండ జిల్లాలో 24 కేసులు, అదిలాబాద్ జిల్లాలో 11 కేసులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 27 కేసులు, జనగాం జిల్లాలో 12 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 31 కేసులు, సూర్యాపేట జిల్లాలో 12 కేసులు చొప్పున నమోదయ్యాయి. గత 40 రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 34,323 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 11,530 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,885 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 20.07.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/p54dJblZJO
— Eatala Rajender (@Eatala_Rajender) July 20, 2020