భూమిపూజకు వీరంతా మిస్.. గురువును మోదీ మ‌ర్చిపోయారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 7:50 AM GMT
భూమిపూజకు వీరంతా మిస్.. గురువును మోదీ మ‌ర్చిపోయారా.?

అయోధ్యలోరామాలయ భూమిపూజ వేళ.. చోటు చేసుకున్న పరిణామాలన్ని చరిత్రలో రికార్డు అయినట్లే.వందల ఏళ్ల నాటి కల తీరిన వేళ.. యావత్ భారతావని కళ్లప్పగించి మరీ.. భూమిపూజకార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షించింది. ఒక విధంగా చూస్తే.. టీవీచానళ్లు మొత్తం రామభజనే చేశాయని చెప్పాలి. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరాముడిఅయోధ్య ఆలయం చుట్టూనే వార్తలు తిరిగాయి. ఈ హడావుడిలో చానళ్లు చాలానే విషయాల్ని లైట్ తీసుకుంది. అయోధ్య భూమిపూజ విజువల్స్ చూపిస్తూ.. మోడీని పదేపదే ప్రస్తావించటమే తప్పించి.. వివిధ కోణాల్లో విశ్లేషణల్ని ఇవ్వటంలో మిస్ అయ్యారనే చెప్పాలి.

మొత్తంగా చానళ్లలో మోడీ భజనే కనిపించింది.. వినిపించింది. రామాలయ భూమిపూజ వేళ.. మాట్లాడిన మోడీతోపాటు.. కీలక నేతల్లో సంఘ్ పరివార్ అధ్యక్షుడు మోహన్ భగవత్ తప్పించి మరెవరికీ కూడాబీజేపీ కురువృద్ధుడు 92 ఏళ్ల లాల్ ‌కృష్ణ ఆడ్వాణీ గుర్తుకు రాకపోవటమే కాదు.. ఆయన పేరును మాట వరసకు కూడా ప్రస్తావించకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. అయోధ్య రామాలయ అంశం ఇవాల్టి వరకు ఈ స్థాయిలో ఉందంటే కారణం.. దీని చుట్టూనే ఎందరో రాజకీయ నేతలు తమ కెరీర్ లో దీని కోసం ఎంతలా కష్టపడ్డారో మర్చిపోలేం.

ఎవరి దాకానో ఎందుకు అయోధ్య రామాలయ అంశం యావత్ భారతావనికి పాకి.. తీవ్రమైన భావోద్వేగ అంశంగా మారటానికి కర్త.. కర్మ.. క్రియ అన్ని అద్వానీయే కారణం.ఆయన పుణ్యమా అనే బీజేపీ ఎజెండాలో రామాలయ అంశం చేరిందన్న వాస్తవాన్ని మర్చిపోలేం. అంతేనా.. రామాలయ నిర్మాణం మీద యావత్ జాతిని ఒక తాటి మీదకు తీసుకురావటంలో ఆయన నిర్వహించిన రథయాత్రను ఎలా మర్చిపోగలం? తాను అనుకున్నట్లుగా రథ యాత్రను పూర్తి చేయలేకపోయినా.. మధ్యలో అరెస్టు కావటం బీజేపీకి మేలే చేసిందని చెప్పాలి.

అలాంటి ఆయన పేరును.. ఆయనకు అత్యంత ఇష్టుడైన శిష్యుడు కమ్ ప్రధాని మోడీనే మర్చిపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. సంఘ్ అధినేతకుతప్పించి.. వేదిక మీద మాట్లాడిన వారెవరికి అద్వాణీ గుర్తుకు రాకపోవటం ఏమిటి?అంతేనా.. రామాలయం కోసం తమ యావత్ జీతాన్ని ధారపోసిన ఎందరో భూమిపూజ వేళ కనిపంచలేదు. వారిలో కొందరు వయోభారం ప్లస్ కరోనా కారణంగా దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరికొందరు కార్యక్రమానికి హాజరైనా.. ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత లభించక.. ఒక మూల కూర్చుండి పోవాల్సి వచ్చింది.

అలాంటి వారిలో కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి..సాధ్విరితింబర లాంటోళ్లు ఉన్నారు. రామాలయం కోసం అహరహం కష్టించిన మురళీ మనోహర్ జోషి.. ప్రమోద్ మహాజన్(మరణించారు).. అశోక్ సింఘాల్.. కల్యాణ్ సింగ్.. వినయ్ కతియార్.. ప్రవీణ్తొగాడియా.. విష్ణుహరి దాల్మియా(గత ఏడాదే మరణించారు) న్యాయవాది పరాశరన్ ల ప్రస్తావనఎక్కడా వినిపించకపోవటం గమనార్హం. మరో కీలక అంశం.. ఇప్పుడు ప్రస్తావించిన వారిలోఅత్యధికులు అద్వాణీకి అత్యంత సన్నిహితులు కావటం. గురువుకు కూసింత మైలేజీ ఇస్తే.. ఏమవుతుంది మోదీజీ?

Next Story