'వైఎస్సార్- వేదాద్రి ఎత్తిపోతల' పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 12:35 PM ISTకృష్ణానదిపై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో నిర్మించనున్న 'వైఎస్సార్- వేదాద్రి ఎత్తిపోతల' పథకానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రిమోట్ ద్వారా ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.368కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 28 గ్రామాల ఎన్‌ఎస్పీ భూములకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, షేర్ని నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సానినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం కృష్ణా జిల్లాలో సమస్యలను పట్టించుకోలేని సీఎం జగన్ అన్నారు. 14 నెలల కాలంలోనే వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, 2021 ఫిబ్రవరి కల్లా వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. పథకం ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు.