బలహీన వర్గాలకు అండగా 'వైఎస్సార్ ఆదర్శం'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Oct 2019 4:57 PM ISTఅమరావతి: నిరుద్యోగ యువతకు 'వైఎస్సార్ ఆదర్శం' పేరుతో వివిధ కార్పొరేషన్‌ల ద్వారా 6000 వాహనాల కొనుగోలుకు సీఎం జగన్ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వాహనాలను వివిధ బ్యాంకుల రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందజేయనుంది. ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం వాహనాలను అందించనుంది. వాహనాలను పంపిణీ చేసేందుకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని 8 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అర్హుల ఎంపిక, రుణాలు మంజూరు వ్యవహారాలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.
Next Story