గుంటూరులో దారుణం.. తెల్లారేసరికి విగతజీవిగా 16 ఏళ్ల బాలిక..

By అంజి  Published on  8 Feb 2020 6:47 AM GMT
గుంటూరులో దారుణం.. తెల్లారేసరికి విగతజీవిగా 16 ఏళ్ల బాలిక..

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ 16 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమర్చారు. శుక్రవారం రాత్రి ఇంట్లో అనుషా (16) నిద్రిస్తుండగా హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. లింగంగుంట్ల కాలనీలో బసవయ్య అనే వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతున్నాడు. శుక్రవారం తన బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి భార్య, కూతురు అనుషా, కుమారుడు కుమార స్వామిలతో కలిసి బసవయ్య వెళ్లాడు. తిరిగి అతని కుమార్తె, కుమారుడు నర్సారావుపేటలోని ఇంటికి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రించిన ఇద్దరూ.. తెల్లారేసరికి అనుషా విగతజీవిగా కనిపించింది. అనుషా సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి ఇంట్లో చొరబడి అనుషాను హత్య చేశారని సోదరుడు కుమారస్వామి అంటున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్వ్కాడ్‌ను దర్యాప్తు చేస్తుండగా.. అది కుమారస్వామి చుట్టూనే తిరిగింది. దీంతో సోదరుడు కుమారస్వామిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుషా అనుమానాస్పద మృతిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు అనుషా సోదరుడు కుమారస్వామిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇంటి పక్కల ఉన్న వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది.

Next Story
Share it