కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మోదీన్ అనే వ్యక్తి స్కూల్ ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల పాపను మాయమాటలు చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కామంతో కళ్లు మూసుకుపోయి ఆ పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండటంతో..చుట్టు పక్కల వారు ఆరా తీయగా..పాప జరిగిన విషయం తెలిసింది. దీంతో వారు ఆ నీచుడికి దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితుడు మోదీన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

తెలుగు రాష్ర్టాల్లోనే కాక..దేశ వ్యాప్తంగా ఏదొక మూల ఆడ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్టు వేసేందుకు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఉదంతం అంతటా అలజడి సృష్టించి నప్పటి నుంచి ఇలాంటి కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని చెప్పినా కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆడది కనిపిస్తే చాలు..కామవాంఛ తీర్చుకునేందుకు వెనుకాడట్లేదు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.