విషాదం : కైక‌లూరు మాజీ ఎమ్మెల్యే క‌న్నుమూత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 May 2020 3:18 PM GMT
విషాదం : కైక‌లూరు మాజీ ఎమ్మెల్యే క‌న్నుమూత‌

కైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజా రామచంద‌ర్ (రాజబాబు) మృతి నేడు క‌న్నుమూశారు. జ‌న‌వ‌రి 5, 1942వ సంవ‌త్స‌రంలో జ‌న్మించిన ఆయ‌న‌.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయ‌న త‌న‌ స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరులో మృతిచెందారు.

రాజబాబు 1989- 94ల‌లో కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉండ‌గా.. రెండు మార్లు ప‌రాజ‌యం పాల‌య్యారు. అనంత‌రం 1999 ఎన్నిక‌ల‌లో ఇండిపెండెంట్‌గా నిల‌బ‌డి.. ప్ర‌ముఖ సినీన‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల మీద స్వ‌ల్ప మెజారిటీతో గెలిచారు. ఆ త‌ర్వాత 2004 ఎన్నిక‌ల‌లో మ‌ర‌లా కాంగ్రెస్ త‌రుపు నుండి పోటీ చేసి విజ‌యం సాధించారు. నియోజ‌క‌వ‌ర్గానికి సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడైన‌ రాజబాబు మృతితో కైక‌లూరులో విషాద చాయ‌లు అల‌ముకున్నాయి.

Next Story
Share it