విషాదం : కైకలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 May 2020 8:48 PM ISTకైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజా రామచందర్ (రాజబాబు) మృతి నేడు కన్నుమూశారు. జనవరి 5, 1942వ సంవత్సరంలో జన్మించిన ఆయన.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తన స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరులో మృతిచెందారు.
రాజబాబు 1989- 94లలో కైకలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. రెండు మార్లు పరాజయం పాలయ్యారు. అనంతరం 1999 ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా నిలబడి.. ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయ నిర్మల మీద స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 2004 ఎన్నికలలో మరలా కాంగ్రెస్ తరుపు నుండి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గానికి సీనియర్ రాజకీయ నాయకుడైన రాజబాబు మృతితో కైకలూరులో విషాద చాయలు అలముకున్నాయి.
Next Story