వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌బాబు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Aug 2020 8:24 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌బాబు

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్‌బాబును ముఖ్యమంత్రి జగన్‌ ఖరారు చేశారు. గతనెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మోపిదేవి వెంకటరమణ ఎన్నికయ్యారు. దాంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఆస్థానానికి విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు డా.పెన్మత్స సూర్యనారాయణరాజు ( డా. సురేష్‌బాబు) ను ఎన్నికల్లో పోటికి దింపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న నామినేషన్లు స్వీకరించనున్నారు.

Next Story