కరోనా వైరస్‌పై సంచలన ప్రకటన చేసిన వుహాన్ వైరాలజీ లాబ్ డైరెక్టర్
By సుభాష్ Published on 24 May 2020 4:27 PM ISTముఖ్యాంశాలు
వైరస్ ఉందన్న విషయం మాకు తెలియదు
తెలియని వైరస్‌కు పరిశోధనలు ఎందుకు చేస్తాం
అమెరికా ఆరోపణలను కొట్టిపారేసిన వూహన్ వైరాలజీ ల్యాబ్ డైరెక్టర్
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో చైనాలోని వూహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనాలో పుట్టిన వైరస్ దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా వ్యాపించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిగా మంది మృత్యువాడ పడ్డారు. ఇంకా ఎంతో మంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్ .. చైనాపై ప్రపంచ దేశాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక అమెరికా మాత్రం చైనాపై నిప్పులు చెరిగిపోతోంది. కావాలనే వైరస్‌ను వదిలి ప్రపంచదేశాలను నాశనం చేస్తుందని చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అగ్రరాజ్యం పెద్దన్న ట్రంప్. అంతేకాదు చైనాపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అయితే అమెరికా చేస్తున్న ఆరోపణలపై వుహాన్ వైరాలజీ ల్యాబ్ కొట్టిపారేసింది. వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ డైరెక్టర్ యాన్ యీ తీవ్రంగా స్పందించారు. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వైరస్‌పై పలు విషయాలను వెల్లడించారు.
అమెరికా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అమెరికా కట్టుకథలే చెబుతోందని స్పష్టం చేశారు. ఇలాంటి వైరస్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదని, అలాంటప్పుడు పరిశోధనలు ఎలా చేస్తామని ఆయన అన్నారు. మాకు తెలియని వైరస్‌ను ఏ విధంగా ల్యాబ్‌లో ఉంచుతాం.. అది ఏ విధంగా లీక్ అవుతుంది..? అని వాంగ్ యాన్ ప్రశ్నించారు. మా ల్యాబ్‌లో ఉన్న వైరస్‌లలో కొన్ని గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతాయని, కానీ ఆ వైరస్‌ల జన్యుక్రమంతో కరోనా వైరస్‌కు పోలికే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వైరస్‌పై మాకు ఎలాంటి అవగాహన లేదని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం వుహాన్ ల్యాబ్‌లో గబ్బిలాల నుంచి వచ్చిన మూడు రకాల వైరస్‌లు ఉన్నాయని, వాటితో సార్స్-కొవ్-2, జన్యుక్రమం పోలి లేదని వాంగ్ యాన్‌యి చెప్పారు. గతంలో విజృంభించిన సార్స్‌తో జన్యుక్రమంతో పోలిస్తే తాజా వైరస్ జన్యుక్రమం 80శాతం మాత్రమే పోలి ఉందని చెప్పుకొచ్చారు. రెండు వైరస్‌లు ఒకటి కావడానికి ఇంతకంటే ఆధారం లేమి ఉండదని, గత ఏడాది డిసెంబర్ 30న మా వద్దకు సార్స్-కొవ్-2 నమూనాలు వచ్చాయని తెలిపారు. జనవరి 2వ తేదీ నాటికి దాని జన్యుక్రమాన్ని ఛేధించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరాలు అందజేశామని ఆయన పేర్కొన్నారు.