నగ్నంగా పూజ చేయాలి.. యువతికి పూజారి మాయమాటలు
By అంజి Published on 19 March 2020 6:32 AM GMTముఖ్యాంశాలు
- బెజవాడలో నకిలీ పూజారి అచ్చిరెడ్డి లీలలు
- హోమాలు, పూజలు పేరిట యువతికి టోకరా
- యూ ట్యూబ్ ఛానెల్ లో భాగస్వామ్యం పేరిట 18 లక్షలు వసూలు
విజయవాడ: దొంగ బాబాలు, పూజారులు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అమాయక ప్రజలను నమ్మించి మాయ మాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్నారు. దేవుడి పేరు చెప్పి మంచి జరుగుతుందని.. బాధితులు నుంచి డబ్బులు లాగుతున్నారు. తీరా విషయం తెలిశాక ప్రజలు బాధపడుతున్నారు.
Also Read: గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా కరోనా..
కృష్ణా జిల్లాలో మరో నకిలీ పూజారి వ్యవహారం బయటపడింది. బెజవాడలో పూజ పేరుతో యువతులు, మహిళల నుంచి డబ్బులు కాజేస్తున్న నకిలీ పూజారి అచ్చిరెడ్డి దొంగ లీలలు బయటపడ్డాయి. తాజాగా ఓ యువతి ఫిర్యాదుతో అతని బాగోతం బయటపడింది. హోమాలు, పూజలు పేరిట పూజారి అచ్చిరెడ్డి యువతులకు గాలం వేసి, వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసే వాడని తెలిసింది.
Also Read: నిర్భయ దోషులు రేపు సూర్యోదయాన్ని చూడకపోవచ్చు..
ఇటీవల హోమాలు, పూజలు చేస్తే నీకు మంచి కలుగుతుందంటూ పూజారి అచ్చిరెడ్డి ఓ యువతికి టోకరా వేశాడు. అమాయక యువతి నుంచి లక్ష వసూలు చేశాడు. అంతే కాకుండా భక్తి విషయాలు చెప్పే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో భాగస్వామ్యం పేరిట యువతి వద్ద నుంచి రూ.18 లక్షలు వసూలు చేశాడు. సినీ స్టార్ అవ్వాలంటే నగ్నంగా పూజ చేయాలని, హోమం చేసే సమయంలో నగ్నంగా కూర్చోవాలని యువతికి మాయ మాటలు చెప్పాడు. దీంతో వెంటనే అనుమానం వచ్చిన యువతి నకిలీ పూజారిపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పూజారి అచ్చిరెడ్డి పరారీలో ఉన్నాడు. నకిలీ పూజారిపై ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అతనిపై గతంలోనూ పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయని సమాచారం. ఇక నకిలీ పూజారి అచ్చిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నా