మారు వేషంలో జనాల్లోకి వెళ్లి తన ఆట గురించి ప్రశ్నలు అడిగిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్
క్రికెట్ ప్రపంచకప్‌పై భారత అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. భారత్ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
By Medi Samrat Published on 1 Nov 2023 3:52 PM ISTక్రికెట్ ప్రపంచకప్‌పై భారత అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. భారత్ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం భారత జట్టు మాత్రమే టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ అజేయంగా ఉంది. సెమీఫైనల్‌కు చేరి టైటిల్‌ను గెలుచుకునే సత్తా ఉన్న టీమ్ భారత్ మాత్రమేనని ఇప్పటికే చాలా మంది క్రీడా ప్రముఖులు అంటున్నారు. అయితే వరల్డ్ కప్ విన్నర్ గురించి పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ మారు వేషంతో కెమెరామెన్‌గా జనాల్లోకి వెళ్లాడు. ఈ సందర్భంగా జరిగిన ఫన్నీ సంభాషనలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Suryakumar Yadav Talks With Fans After Hiding Identityఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ మాస్క్‌తో పాటు అద్దాలు ధరించి పుల్ షర్ట్‌తో దర్శమిస్తాడు. అతడిని చూసిన రవీంద్ర జడేజా గుర్తుపట్టలేకపోతాడు. ఆపై సూర్య తాను మెరైన్ డ్రైవ్‌కు వెళ్తున్నానని జడేజాతో చెప్తాడు. తాను గుర్తుపట్టలేకపోయానని.. నిన్ను ఎవరూ గుర్తించలేరని జడేజా సూర్యతో అంటాడు. ఆపై సూర్య జనాల మధ్యకు వెళతాడు. అందరినీ ప్రశ్నలు అడుగుతాడు. వారు సమాధానాలు ఇస్తారు.
ఓ అభిమానిని సూర్య ప్రశ్నించగా అతడు బదులిస్తూ.. భారత్‌లోని మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లకు మాత్రమే ఎలా ఆడాలో తెలుసు అంటాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఎలాంటి ఆటగాడు అని అడుగుతాడు. అభిమాని రిప్లై ఇస్తూ.. సూర్యకు ఆడటం తెలియదని చెప్పాడు. కోచ్ సహాయంతో బ్యాటింగ్ నేర్చుకోవాలని అంటాడు.
ఆ తరువాత సూర్యకుమార్ ఓ మహిళా అభిమానిని కలుసుకుని ప్రశ్నిస్తాడు. ఈ అభిమాని అతన్ని చాలా పొగుడుతుంది. అతన్ని 360 డిగ్రీ ప్లేయర్ అని పిలుస్తుంది. అది అతడికి చాలా సంతోషాన్నిస్తుంది. వెంటనే సూర్యకుమార్ తన అద్దాలు, ముసుగును తీసివేసి అభిమానితో ఫోటో తీయించుకుని అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆపై మాట్లాడుతూ.. అభిమానులతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని చెబుతాడు. ఈ వీడియో బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.