రోహిత్ అప్పుడు చాలా భయపడ్డాడు..!
విరాట్ కోహ్లీ అనూహ్యంగా కెప్టెన్సీకి దూరమవ్వడం ఇప్పటికీ ఓ పెద్ద సస్పెన్స్!!ఊహించని
By Medi Samrat Published on 10 Nov 2023 3:15 PM ISTవిరాట్ కోహ్లీ అనూహ్యంగా కెప్టెన్సీకి దూరమవ్వడం ఇప్పటికీ ఓ పెద్ద సస్పెన్స్!! ఊహించనిపరిస్థితుల మధ్య కెప్టెన్సీ కోల్పోయాడు. కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు అందుకున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. ఆనాడు చోటు చేసుకున్న పరిణామాలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీ కెప్టెన్సీ నుండి వైదొలిగాక.. టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రోహిత్ శర్మ వెనుకంజ వేశాడని గంగూలీ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో ఆడడం అనేది ఒత్తిడితో కూడుకున్న విషయం అని, దాంతో కెప్టెన్సీకి న్యాయం చేయలేనని రోహిత్ భావించాడని గంగూలీ వివరించారు. రోహిత్ శర్మతో బోర్డు ప్రతిపాదనకు నువ్వు సరే అనాల్సిందే, లేకపోతే టీమిండియా కెప్టెన్ గా నీ పేరును నేనే ప్రకటిస్తానని చెప్పనున్నారు గంగూలీ. నా సంతోషం కొద్దీ రోహిత్ శర్మ అందుకు ఒప్పుకున్నాడని.. ప్రస్తుతం అతడి నాయకత్వం ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తున్నారన్నారు గంగూలీ. వరల్డ్ కప్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు... అందుకు టీమిండియా సాధించిన విజయాలే నిదర్శనమని గంగూలీ రోహిత్ శర్మను కొనియాడారు. భారత జట్టు ఆడుతున్న విధానం, భారతీయులందరికీ ఎంతో నచ్చింది. 8 మ్యాచుల్లో 8 జట్లను చిత్తు చేసి ఘన విజయాలు అందుకున్నారన్నారు గంగూలీ. ఇక వేయాల్సిన అడుగులు తక్కువే, కానీ వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి.. కప్పు తేవాలని ఆకాంక్షించారు గంగూలీ.