వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన 29వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ 100 పరుగుల తేడాతో ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో టీమిండియా వరుసగా ఆరో విజయం సాధించింది. అదే సమయంలో ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఇది ఐదో ఓటమి. ప్రస్తుతం భారత జట్టు సెమీఫైనల్‌కు చేరువలో ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో ఉంది.
భారత జట్టులో రోహిత్(87) సెంచరీ మిస్ కాగా.. రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్(49) పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లి మూడు, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టులో లివింగ్ స్టన్(27) దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో షమీ నాలుగు, బుమ్రా మూడు, కుల్‌దీప్ యాదవ్ రెండు, జడేజా ఒకటి చొప్పున వికెట్లు తీశారు.