వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌, పాక్ జ‌ట్లే త‌ల‌ప‌డుతాయి..!

ప్రపంచ కప్ 2023పై ఉత్కంఠ పెరగడం ప్రారంభమైంది. అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై

By Medi Samrat  Published on  2 Oct 2023 8:33 PM IST
వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌, పాక్ జ‌ట్లే త‌ల‌ప‌డుతాయి..!

ప్రపంచ కప్ 2023పై ఉత్కంఠ పెరగడం ప్రారంభమైంది. అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై టోర్నీ ప్రారంభం కానుంది. మెగా ఈవెంట్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. సొంత‌ గడ్డపై ప్రపంచకప్‌ ఆడుతున్న టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడంలో విజయం సాధిస్తుందని క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ ప్లాటూన్‌తో తలపడే ఇతర జట్టును కూడా గేల్ పేర్కొన్నాడు.

స్టార్ స్పోర్ట్స్ షోలో క్రిస్ గేల్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుందని చెప్పాడు. అంటే టోర్నీ టైటిల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని గేల్ అభిప్రాయపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం.. టీమ్ ఇండియా 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుందని పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇటీవల ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు ఆటతీరు బలంగా ఉండడంతో ఆ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కూడా అసమానంగా ఉంది.

ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడ‌నుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Next Story