ఓడిపోయినా కెప్టెన్‌కి పాకిస్థాన్‌లో ఘనస్వాగతం.. వీడియో వైరల్

ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు.. పాక్‌ జట్టు టైటిల్ పేవ‌రేట్ల‌లో

By Medi Samrat  Published on  13 Nov 2023 3:49 PM IST
ఓడిపోయినా కెప్టెన్‌కి పాకిస్థాన్‌లో ఘనస్వాగతం.. వీడియో వైరల్

ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పోరాటం ముగిసింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు.. పాక్‌ జట్టు టైటిల్ పేవ‌రేట్ల‌లో ఒక‌టిగా పరిగణించబడింది, కానీ టోర్నమెంట్ ప్రారంభమైన త‌ర్వాత‌ చిత్రం భిన్నంగా కనిపించింది. పాక్‌ సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఈ సమయంలో పాకిస్తాన్ అభిమానులు కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్‌పై చాలా కలత చెందారు.

ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తే పాకిస్తానీ అభిమానుల కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుందని భయపడ్డారు.. కానీ దీనికి విరుద్ధంగా ఉంది. సోషల్ మీడియాలో ఓ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీలు ప‌డ్డారు. అయితే.. భద్రతా సిబ్బంది వారిని దూరంగా ఉంచారు. దీంతో కొందరు అభిమానులు 'బాబర్ ఐ లవ్ యూ' అని అరవడం మొద‌లుపెట్టారు.

ప్రపంచ కప్ 2023లో బాబర్ ఆజం తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో బాబ‌ర్‌ 320 పరుగులు చేశాడు. 2023 ప్రపంచకప్‌లో బాబర్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. నాలుగు అర్ధ సెంచరీలు సాధించగలిగాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆడిన 74 పరుగుల ఇన్నింగ్స్ అతని వ్యక్తిగత అత్యధిక ఇన్నింగ్స్.

Next Story