ఉప ప్రధానిపై కూల్‌డ్రింక్ తో మహిళ దాడి..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Sept 2020 4:32 PM ISTకరోనా వైరస్‌పై దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఉప ప్రధానికి అవమానం జరిగింది. వివరాళ్లోకెళితే.. భారత సంతతికి చెందిన డాక్టర్ లియో వరద్కర్ ఐర్లాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్(ఉప ప్రధాని). కరోనా వైరస్ కేసులు పెరగడంపై ఆయన డబ్లిన్ లో మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో మాస్క్ ధరించిన ఓ యువతి వరద్కర్ మీదికి కూల్ డ్రింక్ విసిరింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఈ హఠాత్త్ పరిణామంపై వరద్కర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ మహిళ కూల్ డ్రింక్ విసిరింది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. కరోనా వైరస్ పై ప్రజలకు ఏం చెప్పాలనుకున్నానో ముందే చెప్పాను. ఈ దాడి కారణంగా అదనపు భద్రత కావాలని తాను కోరడం లేదన్నారు.
అయితే.. వరద్కర్ పై దాడిని ఐరిష్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ అధ్యక్ష అభ్యర్థి గావిన్ డఫీ స్పందిస్తూ.. ఈ దాడి మీ పైన జరిగింది కాదు.. ఇది మన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఆ మహిళ మీపై విసిరింది కాఫీ అని తెలిసింది.. అదే యాసిడ్ అయితే ఏం చేసేవాళ్లం.. మనల్ని మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఐరిష్ పోలీసులు ఆ మహిళను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.