ఇంటి పైకప్పు మీద నుండి స్విమ్మింగ్ పూల్ లో దూకాలని అనుకుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2020 6:49 PM IST
ఇంటి పైకప్పు మీద నుండి స్విమ్మింగ్ పూల్ లో దూకాలని అనుకుంది

ఇంటి పైకప్పు నుండి స్విమ్మింగ్ పూల్ లోకి దూకే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చాలా ఎక్కువగానే చూసి ఉంటాం. అలా చేసే సమయాల్లో కొన్ని కొన్ని సార్లు అనుకోని కష్టాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఓ మహిళ ఇంటి పైకప్పు నుండి స్విమింగ్ పూల్ లోకి దూకాలని చేసిన ప్రయత్నంలో ఆమె అనుకోని రీతిలో ఇబ్బందులు పడింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జులై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఓ మహిళ ఇంటి పైకప్పు నుండి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి మరో వ్యక్తితో కలిసి దూకాలని అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్లుగా ఆ జంప్ సాగలేదు.

ఒక్క క్షణం పాటూ చూస్తున్న వారికి కూడా ఊపిరి ఆగిపోయే వీడియో అది. ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకాలని అనుకుంది. ఆమెతో పాటూ ఉన్న వ్యక్తి స్విమ్మింగ్ పూల్ లోకి దూకేశాడు... ఈమె కూడా దూకాలని అనుకుంది.. కానీ కింద ఉన్న రేకుల షెడ్ మీద పడింది.. అక్కడి నుండి ఆమె స్విమ్మింగ్ పూల్ లో పడింది. ఆమెకు ఏమో అయ్యింది అనుకునే లోపే నీటిలో నుండి ఆమె లేచి కనిపించింది. తనకేమీ కాలేదు అంటూ ఆమె తన చేతులను పైకి ఎత్తి అందరికీ సిగ్నల్స్ ఇచ్చింది.



ట్విట్టర్ యూజర్ Jasmine Rodriguez ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కనిపించిన మహిళకి ఏమీ అవ్వలేదని స్పష్టం చేసింది. ఈ వీడియో 11 మిలియన్లకు పైగా వీక్షించారు. 80వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఆమె చేసిన పని చాలా మూర్ఖత్వంతో కూడుకున్నదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ పార్టీ వీడియోను చూసి కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో ఒకరి మరొకరు అంత దగ్గరగా కనీసం సామాజిక దూరాన్ని పాటించడం లేదంటూ తిట్టడం మొదలుపెట్టారు. అంత మంది అక్కడ ఉన్నా ఆమెకు కనీసం ఏమైందో కూడా పట్టించుకోలేదని కామెంట్లు చేశారు.

Next Story