మహిళా అబార్షన్‌ కేసు.. సీపీ అంజనీకుమార్‌కు నోటీసులు..

By అంజి  Published on  17 March 2020 7:08 AM GMT
మహిళా అబార్షన్‌ కేసు.. సీపీ అంజనీకుమార్‌కు నోటీసులు..

హైదరాబాద్‌: మహిళా అబార్షన్‌ కేసులో పలువురు అధికారులకు నాంపల్లి కోర్టు బెయిలబుల్‌ నోటీసులు జారీ చేసింది. 2017లో చాదర్ ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంటున్న ఆనంద్‌ తనపై ఫిర్యాదు చేశాడు. గర్భవతిగా ఉన్న తన భార్యను తనకు తెలియకుండా అబార్షన్‌ చేయించారని ఆనంద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదుపై 315 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. తన భార్య అబార్షన్‌పై మెడికల్‌ బోర్డు, పోలీసులు తప్పుడు వివరాలు ఇచ్చారని ఆనంద్‌ కోర్టుకు తెలిపాడు. దీనిపై ఇవాళ నాంపల్లి కోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

Also Read: విద్యార్థులకు సెలవులు.. త్వరలో సీఎం జగన్‌ సర్కార్‌ నిర్ణయం..

డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి రమేష్‌రెడ్డి, సుల్తాన్‌ బజార్‌ ఏసీపీగా పని చేసిన చైతన్య, సీఐ సత్తయ్యకు బెయిలబుల్‌ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌, డీఎంఈ రమేష్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ చైతన్య, సత్తయ్య హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19న వ్యక్తి గతంగా కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి నాంపల్లి కో్టు వాయిదా వేసింది.

Also Read: మనుషుల అక్రమ రవాణా కేసులో ‘సంచలన తీర్పు’..

Next Story