మనుషుల అక్రమ రవాణా కేసులో 'సంచలన తీర్పు'..

By అంజి  Published on  17 March 2020 6:45 AM GMT
మనుషుల అక్రమ రవాణా కేసులో సంచలన తీర్పు..

మానవ అక్రమ రవాణా చేస్తూ.. ఎంతో మంది చావుకు కారణమైన ముగ్గురు నిందితులకు 125 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ టర్కిష్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

అది నాలుగు సంవత్సరాలు క్రితం జరిగిన ఘటన.. కొంత మంది శరణార్థులు టర్కీ దేశం నుంచి గ్రీకు చేరుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో డబ్బుకు ఆశపడిన బోటుకు సంబంధించిన వ్యక్తులు 8 మందికి పరిమితలం గల బోటులో 16 మందిని ఎక్కించుకున్నారు. అయితే బోటు సముద్రం తీరం నుంచి కొంత దూరం వెళ్లాక బోల్తా పడింది. దీంతో చిన్నారి అలెన్‌ కుర్దీ సహా పలువురు ప్రమాదంలో మృతి చెందారు. కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకు దోషులు రూ.6 వేల డాలర్లు వసూలు చేశారని తెలిసింది. ఈ ఘటనపై నాలుగు సంవత్సరాలు టర్కీష్‌ కోర్టు తీర్పును వెలువరించింది. ముగ్గురు దోషులతో పాటు మనుషులను అక్రమ రవాణా చేస్తున్న మరికొంత మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Also Read: విద్యార్థులకు సెలవులు.. త్వరలో సీఎం జగన్‌ సర్కార్‌ నిర్ణయం..

శరణార్థుల పరిస్థితులు ఎలా ఉంటాయో.. గత నాలుగు సంవత్సరాల క్రితం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మూడేళ్ల చిన్నారి అలెన్‌ కుర్దీ మృతదేహం ప్రపంచానికి తెలియజెప్పింది. సముద్ర తీరంలో అచేతనంగా పడి ఉన్న అలెన్‌ కుర్దీని ఫొటో అప్పట్లో ప్రపంచ దేశాలను కదిలించింది. దీంతో అన్ని శరాణార్థుల సమస్యలపై స్పందించాయి. ఆ బాలుడి చిత్రం అప్పట్లో అందరి హృదయాలను కలచివేసింది. శరాణార్థుల విషయంలో పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

Also Read: కరోనాతో మరో వ్యక్తి మృతి

Next Story