కరోనాతో మరో వ్యక్తి మృతి

By అంజి  Published on  17 March 2020 6:01 AM GMT
కరోనాతో మరో వ్యక్తి మృతి

ఢిల్లీ: భారత్‌లో తాజాగా కరోనా వైరస్‌ సోకి మూడో వ్యక్తి మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కరోనా వైరస్‌ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు ఇవాళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా బాధితుడు మృతి చెందాడు.

దేశంలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 125కు పెరిగింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టింది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.



కరోనా వైరస్‌ మృతుల సంఖ్య మన దేశంలో మూడుకు చేరుకుంది. కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి ఇద్దరు చనిపోయారు. అందులో ఒకరు ఢిల్లీకి చెందిన వారు కాగా.. మరోకరు కర్నాటకకు చెందిన వారు.

కరోనా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకూ దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు..హాస్టళ్లు, ఇతర విద్యాసంస్థలను కూడా మూసివేయాల్సిందిగా అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు సూచనలిచ్చింది. అలాగే థియేటర్లు, జిమ్ సెంటర్లు, మ్యూజియంలు, సాంస్కృతి, సామాజిక కార్యక్రమాలు జరిగే వేదికలు, ఫంక్షన్ హాల్స్, స్విమ్మింగ్ పూల్స్ కూడా మూసివేయాల్సిందిగా కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. సెలవులిచ్చారు కదా అని..విద్యార్థులు మూకుమ్మడిగా ప్రయాణాలు చేయరాదని వారించింది. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని తెలిపింది.

Next Story